Published on May 1, 2025
Admissions
ఇండియన్‌ మిలిటరీ అకాడమీ టీజీసీ-142 కోర్సులో ప్రవేశాలు
ఇండియన్‌ మిలిటరీ అకాడమీ టీజీసీ-142 కోర్సులో ప్రవేశాలు

డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) 2026 జనవరిలో ప్రారంభమయ్యే 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

టెక్నికల్ గ్రాడ్యుయేట్‌ కోర్స్‌-142

వివిధ విభాగాల్లో ఉన్న సీట్ల వివరాలు..
1. సివిల్: 08
2. మెకానికల్: 06
3. సీఎస్‌(కంప్యూటర్‌ సైన్స్‌): 06
4. ఎక్ట్రికల్‌: 02
5. ఎలక్ట్రానిక్స్‌: 06
6. ఇతర విభాగాలు: 02

మొత్తం సీట్ల సంఖ్య: 30

అర్హత: కోర్సు సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ(మెకానికల్‌, సివిల్, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, సీఎస్‌, ఇతర ఇంజినీరింగ్‌ విభాగాలు)లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 2026 జనవరి 1వ తేదీ నాటికి అభ్యర్థులకు 20 - 27 ఏళ్లు ఉండాలి. (అభ్యర్థులు 1999 జనవరి 2 - 2006 జనవరి 1 తేదీల మధ్య జన్మించి ఉండాలి.)

స్టైపెండ్‌: నెలకు రూ.56,100.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 20.

Website: https://www.joinindianarmy.nic.in/Authentication.aspx