Published on Mar 30, 2025
Government Jobs
ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటిలో ఫ్యాకల్టీ పోస్టులు
ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటిలో ఫ్యాకల్టీ పోస్టులు

ఇండియన్‌ మారిటైమ్‌ యూనిర్సిటీ (ఐఎంయూ) వివిధ విభాగాల్లో ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10

వివరాలు:

1. అసోసియేట్‌ ప్రొఫెసర్‌(ఓషన్‌ ఇంజినీరింగ్‌): 01

2. అసిస్టెంట్ ప్రొఫెసర్‌(ఓషన్‌ ఇంజినీరింగ్‌): 01

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(మ్యాథ్స్‌): 05

4. అసిస్టెంట్ ప్రొఫెసర్‌(మెకానికల్ ఇంజినీరింగ్‌): 03

విభాగాలు: ఓషన్‌ ఇంజినీరింగ్, మ్యాథ్స్‌, మెకానికల్ ఇంజినీరింగ్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: అసోసియేట్ ప్రొఫెసర్‌కు 60 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.37,400 - రూ.67,000, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.15,600 - రూ.39,100.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.700.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21 ఏప్రిల్‌ 2025

Website: https://www.imu.edu.in/imunew/recruitment

Apply online: https://imurec.samarth.edu.in/