Published on Mar 23, 2025
Government Jobs
ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎంఆర్‌) పోస్టులు
ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎంఆర్‌) పోస్టులు

భారత నౌకాదళంలో అగ్నివీర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ వెలువడింది. ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ప్రారంభమయ్యే 02/2025, 01/2026/ 02/2026 బ్యాచ్‌ పేరున

శిక్షణ ఉంటుంది. 

వివరాలు:

అగ్నివీర్ (మెట్రిక్‌ రిక్రూట్‌- ఎంఆర్‌) ఖాళీలు

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 2024-25 విద్యాసంవత్సరంలో టెన్త్‌ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తుకు అర్హులు.

వయసు: అగ్నివీర్‌ 02/2025 బ్యాచ్‌కు అభ్యర్థి 01.09.2004 - 29.02.2008. అగ్నివీర్‌ 01/2026 బ్యాచ్‌కు 01.02.2005 - 31.07.2008. అగ్నివీర్‌ 02/2026 బ్యాచ్‌కు 01.07.2005 - 31.12.2008

మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు, మహిళలు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, స్టేజ్‌-1 (ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌), స్టేజ్‌-2 (రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష- పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

శిక్షణ: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో 02/2025 బ్యాచ్‌కుకు సెప్టెంబర్‌ 2025లో, 01/2026 బ్యాచ్‌కు ఫిబ్రవరి 2026లో, 02/2026 బ్యాచ్‌కు జులై

2026లో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 50 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 50 మార్కులను కలిగి ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్,

మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ నాలుగు విభాగాల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి అర గంట. 

దరఖాస్తు ఫీజు: రూ.550.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 29-05-2025.

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10-04-2025.

స్టేజ్‌1 ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌: 2025 మే 25న.

Website: https://www.joinindiannavy.gov.in/