ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) రాయ్‌పూర్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
వివరాలు:
1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 03
2. సీనియర్ స్టోర్ అండ్ పర్చేస్ ఆఫీసర్: 01
3. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 05
4. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 04
5. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, మాస్టర్ డిగ్రీ, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ స్టోర్ అండ్ పర్చేస్ ఆఫీసర్‌కు 50 ఏళ్లు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు 45 ఏళ్లు, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు 40 ఏళ్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు.
జీతం: నెలకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ స్టోర్ అండ్ పర్చేస్ ఆఫీసర్‌కు రూ.56,100, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు రూ.47,600, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు రూ.35,400, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కు రూ.25,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21-03-2025.