Published on Sep 3, 2025
Government Jobs
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌లో పోస్టులు
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌లో పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ ముంబయి (ఐఐపీ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 23

వివరాలు:

1. అడిషనల్ డైరెక్టర్‌/ప్రొఫెసర్‌: 01

2. డిప్యూటీ డైరెక్టర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(టెక్నికల్): 02

3. అసిస్టెంట్ డైరెక్టర్‌/లెక్చరర్‌(టెక్నికల్): 04

4. అసిస్టెంట్‌ డైరెక్టర్‌(అడ్మినిస్ట్రేషన్‌): 01

5. టక్నికల్ అసిస్టెంట్‌: 07

6. క్లర్క్‌: 05

7. జూనియర్ అసిస్టెంట్‌: 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. టైపింగ్ వచ్చి ఉండాలి.

వయోపరిమితి: అడిషనల్ డైరెక్టర్‌కు 50 ఏళ్లు, డిప్యూటీ డైరెక్టర్‌కు 40 ఏళ్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు 35 ఏళ్లు, టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, జూనియర్ అసిస్టెంట్‌, క్లర్క్‌కు 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్‌ 24.

Website:https://www.iip-in.com/iip-careers/current-openings.aspx