Published on Jan 8, 2026
Government Jobs
ఇండియన్‌ ఆర్మీ - 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సు
ఇండియన్‌ ఆర్మీ - 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సు

భారత సైన్యం 2026 అక్టోబర్‌లో ప్రారంభమయ్యే 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సులో చేరడానికి అర్హత గల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పురుష (ఎస్‌ఎస్‌సీ టెక్‌-67) అభ్యర్థులు ద‌ర‌ఖాస్తుల‌కు అర్హులు. కోర్సు ప్రి-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (పీసీటీఏ) లో జరుగుతుంది. 

వివరాలు:

షార్ట్‌ సర్వీస్‌ కమీషన్‌ (టెక్‌)-67 పురుషులు- 350 పోస్టులు

ఇంజినీరింగ్ విభాగాలు: 

సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్, ఎంఐఎస్సీ ఇంజినీరింగ్‌ విభాగాలు.

అర్హతలు: బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులు లేదా 2026 అక్టోబర్‌ 1కి ముందు డిగ్రీ పూర్తిచేసే ఫైనల్ ఇయర్ విద్యార్థులు.

ఫిజికల్ స్టాండర్డ్స్: 

పురుషులు- 2.4 కి.మీ. పరుగు 10.30 నిమిషాల్లో, పుష్-అప్స్ 40, పుల్-అప్స్ 6; సిట్‌ అప్స్‌- 30, ఈతలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి: 20 నుంచి 27 సంవత్సరాల మధ్య (01 అక్టోబర్‌ 1999 - 30 సెప్టెంబర్‌ 2006 మధ్య జన్మించిన వారై ఉండాలి).

జీతం: రూ.56,100 - రూ.1,77,500.

ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్: రూ.56,100.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, గ్రాడ్యుయేషన్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ కేంద్రాలు: అలహాబాద్, భోపాల్, బెంగళూరు, జలంధర్ కాంట్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 05.02.2025.

Website:https://www.joinindianarmy.nic.in/Authentication.aspx