ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ కోర్సు ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 76 (ఎన్‌సీసీ పురుషులు: 70, ఎన్‌సీసీ మహిళలు: 06)
వివరాలు:
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ కోర్సు (అక్టోబర్ 2025)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడు అకడమిక్ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌లో కనీసం బి గ్రేడ్ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సి సర్టిఫికెట్ అవసరం లేదు.
వయోపరిమితి: 01-07-2025 నాటికి 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్‌లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 టెస్టులు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
శిక్షణ, వేతనాలు: ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడెమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్ట్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారికి పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-03-2025.
Website:https://joinindianarmy.nic.in/Authentication.aspx
Apply online:https://joinindianarmy.nic.in/Authentication.aspx