ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) దిల్లీ, హరియాణ, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్/డిప్లొమా/ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: 523
వివరాలు:
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, సివిల్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ మొదలైనవి.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 30.09.2025 తేదీ నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 సెప్టెంబరు 12.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్ 11.
Website:https://iocl.com/apprenticeships