Published on Dec 10, 2025
Apprenticeship
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) ఈస్టర్న్‌ రీజియన్‌లో వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 509

వివరాలు:

1. డిప్లొమా టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 248

2. ట్రేడ్‌ అప్రెంటిస్‌: 127

3. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 107 

4. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 27

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, మొదలైనవి..

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 31.12.2025 తేదీ నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 9.

Website:https://iocl.com/apprenticeships