- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చాడ రాజిరెడ్డి బెంగళూరులోని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎన్నికయ్యారు. రసాయన శాస్త్రంలో.. ప్రత్యేకించి ఆరోగ్య సంరక్షణ అనువర్తనాల కోసం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో ఆయన చేసిన అత్యుత్తమ పరిశోధనలకు దక్కిన గుర్తింపు ఇది.
- భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవిడ్ టీకా కొవాగ్జిన్‌లో ఉపయోగించిన అడ్జువెంట్ మాలిక్యూల్ అభివృద్ధి ప్రక్రియలో పాల్గొన్న కీలక శాస్త్రవేత్తల్లో డాక్టర్ రాజిరెడ్డి ఒకరు.