16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాల వినియోగంపై ఇండోనేసియా కఠిన ఆంక్షలను తెచ్చింది. యూట్యూబ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్రెండ్స్, ఎక్స్, బిగో లైవ్, రోబ్లోక్స్ లాంటి సామాజిక మాధ్యమాల్లో చిన్నారులు అకౌంట్లను తెరిచేందుకు వీలులేదంటూ 2026, మార్చి 28న కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీంతో ఆగ్నేయాసియాలో చిన్నారుల సామాజిక మాధ్యమాల వినియోగంపై ఆంక్షలు తీసుకువచ్చిన మొదటి దేశంగా ఇండోనేసియా నిలిచింది.