డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ డేవిస్‌కప్‌ను నెగ్గింది. 2024, నవంబరు 25న మాలగా (స్పెయిన్)లో జరిగిన ఫైనల్లో 2-0తో నెదర్లాండ్స్‌ను ఓడించింది.
ప్రపంచ నంబర్‌వన్ యానెక్ సినర్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి సింగిల్స్‌లో బెరిటిని 6-4, 6-2తో బొటిక్ వాండెపై నెగ్గి ఇటలీని ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.
రెండో సింగిల్స్‌లో సినర్ 7-6 (7-2), 6-2తో గ్రిక్‌స్ఫూర్‌పై పైచేయి సాధించి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. సింగిల్స్‌లోనే ఫలితం తేలడంతో డబుల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు.
చెక్ రిపబ్లిక్ (2012, 2013) తర్వాత వరుసగా డేవిస్‌కప్ గెలిచిన ఘనత ఇటలీదే.