ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్ తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది.
దీని ప్రకారం 2026 జూన్ వరకూ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులను సమర్థంగా పరిష్కరించిన తపన్ కుమార్ పదవీకాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి.
2024లోనూ ఆయనకు తొలిసారి పొడిగింపు లభించింది.
హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన తపన్ కుమార్.. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
ఈయన గతంలో రెండు దశాబ్దాల పాటు ఐబీ ఆపరేషన్స్ విభాగానికి అధిపతిగా వ్యవహరించారు.
2008 ముంబయి 26/11 ఉగ్రదాడి సమయంలో కౌంటర్ ఆపరేషన్లకు ఆయన నేతృత్వం వహించారు.