సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్ర గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 18న ‘ఇంటర్నేషనల్ మ్యూజియం డే’గా నిర్వహిస్తారు.
పురాతన కళాఖండాలు, శిల్పాలు, కళాత్మక రచనలు, సంస్కృతి - సంప్రదాయాలను ప్రతిబింబించే అనేక రకాల వస్తువులను భద్రపరిచే ప్రదేశమే మ్యూజియం.
ఇవి మానవాళికి వారసత్వ సంపదలు, చరిత్ర, సైన్స్, సంస్కృతులను తెలిపే విద్యా కేంద్రాలుగా కూడా విరాజిల్లుతున్నాయి
చారిత్రక నేపథ్యం:
1977లో రష్యాలోని మాస్కోలో జరిగిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం (ఐసీఓఎం) సర్వసభ్య సమావేశంలో ఏటా మే 18న ‘ఇంటర్నేషనల్ మ్యూజియం డే’గా నిర్వహించాలని తీర్మానించారు.
ఐసీఓఎం 1946లో ఏర్పాటైంది.
ప్రపంచవ్యాప్తంగా 141 దేశాల్లోని సుమారు 37,000 మ్యూజియంలకు ఇందులో సభ్యత్వం ఉంది.
సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే లక్ష్యంతో ఇది యునెస్కోతోనూ కలిసి పనిచేస్తోంది.