ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెసస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్-ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 20
వివరాలు:
1. ఆఫీసర్స్ గ్రేడ్-ఏ(జనరల్ స్ట్రీమ్): 12
2. ఆఫీసర్స్ గ్రేడ్-ఏ(లీగల్ స్ట్రీమ్): 04
3. ఆఫీసర్స్ గ్రేడ్-ఏ(ఐటీ స్ట్రీమ్): 04
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎల్‌ఎల్‌బీ, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.62,500 - రూ.1,26,100.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 సెప్టెంబర్ 11.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 25.
పరీక్ష తేదీలు:
ఫేజ్-1 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్: 2025 అక్టోబర్ 11.
ఫేజ్-2 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్: 2025 అక్టోబర్ 15.
Website:https://ifsca.gov.in/Career