మహారాజా దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింహ్‌జీ విగ్రహాన్ని నెవాటిమ్ (ఇజ్రాయెల్)లోని యూదు రైతుల సహకార సంఘమైన ‘‘మోషవ్’’లో ఆవిష్కరించారు. మహారాజా రంజిత్‌సింహ్‌జీ గుజరాత్‌లో ప్రస్తుతం జామ్‌నగర్‌గా ప్రసిద్ధమైన నవనగర్ సంస్థానాధీశుడు. ప్రపంచ యుద్ధకాలంలో అత్యంత దయాగుణం కనబరిచిన ఆ సంస్థానాధీశుని విగ్రహం స్థాపించడం ద్వారా ఇండియన్ జ్యూయిష్ హెరిటేజ్ సెంటర్, కొచిని జ్యూయిష్ హెరిటేజ్ సెంటర్‌లు ఆయనను మరణానంతరం సత్కరించాయి.