Published on Nov 6, 2024
Government Jobs
ఇంజినీర్స్‌ లిమిటెడ్‌లో మేనేజీరియల్ పోస్టులు
ఇంజినీర్స్‌ లిమిటెడ్‌లో మేనేజీరియల్ పోస్టులు

దిల్లీలోని ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్‌) మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 12

వివ‌రాలు:

1. మేనేజర్: 04

2. డిప్యూటీ మేనేజర్: 04

3. జూనియర్ సెక్రటరీ: 04

విభాగాలు: రాక్ ఇంజినీరింగ్, జియాలజీ, హైడ్రాలజీ, మైనింగ్, సెక్రటేరియల్ సర్వీసెస్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: మేనేజర్ పోస్టులకు 36 ఏళ్లు; మిగతా పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు మేనేజర్ పోస్టులకు రూ.80,000- రూ.2,00,000; డిప్యూటీ మేనేజర్ రూ.70,000- రూ.2,00,000;  జూనియర్ సెక్రటరీ పోస్టులకు రూ.29,000- రూ.1,20,000. 

పని ప్రదేశాలు: దిల్లీ, గురుగ్రామ్, చెన్నై, వడోదర, కోల్‌కతా. 

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 18-11-2024

Website:https://engineersindia.com/applying-to-eil