న్యూ దిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
వివరాలు:
1. సీనియర్ మేనేజర్ (ప్రాజెక్ట్)- 05
2. మేనేజర్ (ప్రాజెక్ట్)- 05
3. మేనేజర్ (కాపర్ స్మెల్టర్)- 01
4. మేనేజర్ (అల్యూమినియం స్మెల్టర్)- 01
5. మేనేజర్ (డీఆర్‌ఐ)- 01
6. డిప్యూటీ మేనేజర్- (ప్రజెక్ట్)- 04
విభాగాలు: కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ మెటలార్జీ ఇంజినీరింగ్/ మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, మెటలార్జీ/ మెకానికల్/ కెమికల్ ఇంజినీరింగ్/ కెమికల్/
మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్ ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: సీనియర్ మేనేజర్‌కు రూ.90,000- రూ.2,40,000; మేనేజర్‌కు రూ.80,000-రూ.2,20,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.70,000-రూ.2,00,000.
వయోపరిమితి: 28.02.2025 నాటికి డిప్యూటీ మేనేజర్‌కు 32 ఏళ్లు; మేనేజర్‌కు 36 ఏళ్లు; సీనియర్ మేనేజర్‌కు 40ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14.04.2025.
Website: https://engineersindia.com/