Published on Apr 27, 2025
Government Jobs
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజిరియల్‌ పోస్టులు
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజిరియల్‌ పోస్టులు

న్యూ దిల్లీలోని ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈపీఐఎల్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన మేనేజిరియల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 68

వివరాలు: 

1. అసిస్టెంట్‌ మేనేజర్‌- 22

2. మేనేజర్‌ (గ్రేడ్‌-2)- 10

3. మేనేజర్‌ (గ్రేడ్‌-1)- 18

4. సీనియర్‌ మేనేజర్‌- 18

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, లీగల్‌, ఐటీ, ఐసీటీ సపోర్ట్‌. 

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ లేదా తత్సమానం. సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.40,000; మేనేజర్‌ గ్రేడ్‌-2కు రూ.50,000 మేనేజర్‌ గ్రేడ్‌-1కు రూ.60,000; సీనియర్‌ మేనేజర్‌కు రూ.70,000.

వయోపరిమితి: అసిస్టెంట్‌ మేనేజర్‌కు 32 ఏళ్లు; మేనేజర్‌ గ్రేడ్‌-2కు 35 ఏళ్లు; మేనేజర్‌ గ్రేడ్‌-1కు 37 ఏళ్లు; సీనియర్‌ మేనేజర్‌కు 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: కార్పొరేట్‌ ఆఫీస్‌ న్యూదిల్లీ, రిజినల్‌ ఆఫీసెస్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 06.05.2025.

Website: https://epi.gov.in/