న్యూదిల్లీలోని ఐఆర్‌సీఓఎన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇక్రాన్) గ్రాడ్యుయేట్, డిప్లొమా, అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 30
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (20)
విభాగాల వారీగా: ఎలక్ట్రికల్-04; సివిల్-13; సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ అండ్ టీ)-03.
2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 10
విభాగాల వారీగా: సివిల్-07; ఎలక్ట్రికల్-02; సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ అండ్ టీ)-01.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.10,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8,500.
వయోపరిమితి: 18-30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత, షార్ట్‌లిస్ట్, తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15-01-2025