- ఆసియా షూటింగ్ (రైఫిల్/ పిస్టల్) ఛాంపియన్‌షిప్‌లో ఇలవేనిల్- అర్జున్ బబుతా జోడీ స్వర్ణ పతకం సాధించింది. 2026, ఫిబ్రవరి 8న దిల్లోలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో ఇలవేనిల్- బబుతా (505.0) జంట అగ్రస్థానం సాధించింది. దక్షిణ కొరియా జోడీ (501.0) రజతం, జపాన్ జంట (437.1) కాంస్యం నెగ్గాయి.
- జూనియర్ విభాగంలో హిమాన్షు ధిల్లాన్- శాంభవి క్షీరసాగర్ జట్టు కాంస్యం కైవసం చేసుకుంది. 10 మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో హిమాన్షు- శాంభవి (502.4) అగ్రస్థానం సాధించింది. కజకిస్థాన్ (488.6) రెండు, మాల్దీవులు మూడో స్థానంలో నిలిచాయి.