Published on Aug 22, 2025
Current Affairs
ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌
ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సీనియర్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో అర్జున్‌ బబుతా, రుద్రాంక్ష్ సింగ్, కిరణ్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. 2025, ఆగస్టు 21న షెమ్‌కెంట్‌ (కజకిస్థాన్‌)లో జరిగిన మ్యాచ్‌లో 1892.5 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. చైనా (1889.2) రజతం.. కొరియా (1885.7) కాంస్యం గెలుచుకున్నాయి.

జూనియర్‌ బాలుర 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో అభినవ్‌ షా పసిడి డబుల్‌ సాధించాడు. టీమ్‌ విభాగంలో భారత్‌ (అభినవ్, హిమాంశు, నరేన్‌) 1890.1 పాయింట్లతో పసిడి నెగ్గింది. చైనా (1885.1) రజతం, కొరియా (1882.9) కాంస్యం గెలిచాయి. 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో అభినవ్‌ స్వర్ణం నెగ్గాడు. ఫైనల్లో 250.4 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. హ్యున్‌సియో (కొరియా, 250.3) రజతం, షియాన్‌ (చైనా, 229.2) కాంస్యం గెలిచాడు.