ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఇలవేనిల్ వలరివాన్ పసిడి గెలిచింది. తమిళనాడుకు చెందిన ఈమె ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్లోనూ స్వర్ణంతో మెరిసింది. 2025, ఆగస్టు 23న షెమ్‌కెంట్ (కజకిస్థాన్)లో జరిగిన ఫైనల్లో ఇలవేనిల్-అర్జున్ బబుతా జంట 17-11తో డింగ్‌కె లూ-గ్జిన్‌లూ పెంగ్ (చైనా) ద్వయంపై విజయం సాధించింది. అర్జున్‌కు ఇది రెండో పసిడి. అర్జున్, రుద్రాంక్ష్ పటేల్, కిరణ్ జాదవ్‌లతో కూడిన భారత జట్టు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది.