- ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ స్వర్ణం నెగ్గింది. 2026, ఫిబ్రవరి 4న దిల్లీలో ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో పసిడి పతకం గెలిచిన ఇషా.. టీమ్ విభాగంలోనూ స్వర్ణాన్ని దక్కించుకుంది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో ఇషా (239.8) అగ్రస్థానంలో నిలిచింది. చైనీస్ తైపీ అమ్మాయిలు చెంగ్ యెన్ చెంగ్ (235.4), యీ అయ్ వెన్ (217.7) వరుసగా రజత, కాంస్య పతకాలు అందుకున్నారు.
- మహిళల టీమ్ విభాగంలో సురుచి (576), ఇషా (575), మను (575)లతో కూడిన భారత జట్టు (1726) పసిడి కైవసం చేసుకుంది. వియత్నాం (1713) రజతం, చైనీస్ తైపీ (1711) కాంస్యం గెలిచాయి.