Published on Aug 21, 2025
Current Affairs
ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌
ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అనంత్‌ జీత్‌ సింగ్‌ నరుక పురుషుల స్కీట్‌ విభాగంలో స్వర్ణం సాధించగా.. సౌరభ్‌ చౌదరి, సురుచి ఇందర్‌ సింగ్‌ జోడీ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో కాంస్యం గెలిచింది.

2025, ఆగస్టు 20న షింకెంట్‌ (కజకిస్థాన్‌)లో జరిగిన ఫైనల్లో అనంత్‌ జీత్‌ 57-56తో అల్‌ రషీది (కువైట్‌)పై విజయం సాధించాడు. 

మిక్స్‌డ్‌ విభాగంలో మూడో స్థానం కోసం జరగిన పోరులో సౌరభ్‌-సురుచి ద్వయం 17-9తో లియు హెంగ్‌-సీ సియాంగ్‌ చెన్‌ జంటను ఓడించింది.

క్వాలిఫయింగ్‌ రౌండ్లో సౌరభ్‌ 286, సురుచి 292 పాయింట్లతో ఉమ్మడిగా అయిదో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించారు.

చైనా, దక్షిణ కొరియా జోడీలు వరుసగా స్వర్ణం, రజతం గెలిచాయి.