ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో సిఫ్ట్ కౌర్ రెండు స్వర్ణాలు గెలిచింది.
2025, ఆగస్టు 26న షిమ్‌కెంట్ (కజకిస్థాన్)లో జరిగిన మహిళల వ్యక్తిగత 50మీ రైఫిల్ 3 పొజిషన్స్‌లో స్వర్ణం గెలిచిన ఆమె.. భారత్ జట్టు స్వర్ణం గెలవడంలోనూ కీలక పాత్ర పోషించింది.
కౌర్.. వ్యక్తిగత ఫైనల్లో 459.2 పాయింట్లు స్కోర్ చేసి విజేతగా నిలిచింది.
చైనాకు చెందిన యాంగ్ యుజీ (458.8) రజతం నెగ్గగా.. జపాన్ అమ్మాయి నోబతా మిసాకి (448.2) కాంస్యం చేజిక్కించుకుంది.
ఇదే విభాగం టీమ్ ఈవెంట్లో సిఫ్ట్, అంజుమ్ మౌద్గిల్, ఆశి చౌస్కీలతో కూడిన జట్టు టైటిల్ గెలుచుకుంది.
ఈ త్రయం 1753 పాయింట్లు స్కోర్ చేసింది.
జపాన్ (1750) రజతం, దక్షిణ కొరియా (1745) కాంస్యం గెలిచాయి.