ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల ఫ్రీస్టైల్ 62 కిలోల విభాగంలో భారత్‌కి చెందిన మనీషా బన్వాలా స్వర్ణం నెగ్గింది.
2025, మార్చి 28న అమ్మాన్ (జోర్డాన్)లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మనీషా 8-7తో ఒక్ కిమ్ (ఉత్తర కొరియా)ను ఓడించింది.
ప్రస్తుత టోర్నీలో భారత్‌కు దక్కిన తొలి పసిడి ఇదే.
మరోవైపు అంతిమ్ ఫంగాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 53 కిలోల విభాగం కంచు పోరులో ఆమె 10-0తో మింగ్ సువాన్ (చైనీస్ తైపీ)ని చిత్తు చేసింది.