Published on Dec 23, 2024
Current Affairs
ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌
ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి.

2024, డిసెంబరు 21న దోహాలో జరిగిన 55 కేజీల విభాగంలో యూత్‌లో కోయల్, జూనియర్‌లో నీలమ్‌ రజతాలు సాధించారు.

స్నాచ్‌లో 79 కేజీలు ఎత్తిన కోయల్‌ క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 103 కేజీలు లిఫ్ట్‌ చేసింది. మొత్తంగా 182 కేజీలతో రెండో స్థానంలో నిలిచింది.

మరోవైపు స్నాచ్‌లో 86 కేజీలు క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 104 కేజీలు ఎత్తిన నీలమ్‌ ఓవరాల్‌గా 190 కేజీలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.