ఆసియా పవర్ ఇండెక్స్- 2025లో ‘ప్రధాన శక్తి’ హోదాకు భారత్ చేరుకుందని ఆస్ట్రేలియా సంస్థ లోవీ ఇన్‌స్టిట్యూట్ 2025, నవంబరు 28న వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌లో మన దేశ ప్రదర్శన ఆధారంగా ఆర్థికాభివృద్ధి, సైనిక సామర్థ్యాల వల్లే, ఈ హోదా లభించినట్లు తెలిపింది. ఆసియా దేశాల శక్తి సామర్థ్యాలు, చూపించే ప్రభావం ఆధారంగా వార్షిక ఆసియా పవర్ ఇండెక్స్‌ను నిర్ణయిస్తారు.
ఆసియా పవర్ ఇండెక్స్-2024లో 38.1 పాయింట్ల స్కోర్‌తో ఉన్న భారత్.. ఈ ఏడాది (2025)లో 40 పాయింట్లతో ప్రధాన శక్తిగా అవతరించింది. అమెరికా (80.5 పాయింట్లు), చైనా (73.7 పాయింట్లు) తర్వాత భారత్ మూడోస్థానంలో ఉంది.