Published on Sep 26, 2024
Current Affairs
ఆసియా పవర్‌ ఇండెక్స్‌లో భారత్‌కు మూడో స్థానం
ఆసియా పవర్‌ ఇండెక్స్‌లో భారత్‌కు మూడో స్థానం

ఆస్ట్రేలియాకు చెందిన లోవీ సంస్థ విడుదల చేసిన ఆసియా పవర్‌ ఇండెక్స్‌ వార్షిక జాబితాలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని దేశాలను ప్రభావితం చేసే సామర్థ్యమున్న 27 దేశాలు, ప్రాంతాలతో ఈ సూచీని రూపొందించింది. అమెరికా 81.7 స్కోరుతో తొలి స్థానంలో నిలవగా, చైనా (72.7), భారత్‌ (39.1) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జపాన్‌ (38.9) నాలుగో స్థానం, ఆస్ట్రేలియా (31.9) ఐదో స్థానం, రష్యా (31.1) ఆరో స్థానం దక్కించుకున్నాయి.