Published on May 29, 2025
Current Affairs
ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌
ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మిక్స్‌డ్‌ రిలే జట్టు స్వర్ణ పతకాన్ని నెగ్గింది. 2025, మే 28న గమి (దక్షిణ కొరియా)లో జరిగిన 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే పోటీలో భారత జట్టు అగ్రస్థానం సాధించింది. రూపల్‌ చౌదరి, సంతోష్‌ కుమార్, విశాల్, శుభ వెంకటేశన్‌లతో కూడిన భారత జట్టు 3 నిమిషాల 18.12 సెకన్లలో రేసును పూర్తిచేసింది. చైనా (3ని 20.52సె) రజతం, శ్రీలంక (3ని 21.95సె) కాంస్యం గెలిచాయి.