Published on May 30, 2025
Current Affairs
ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌
ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

జ్యోతి యర్రాజి ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో స్వర్ణం సాధించింది.

2025, మే 29న గమి (దక్షిణ కొరియా)లో జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌ రేసును ఆమె 12.96 సెకన్లలో ముగించింది.

1998లో ఓల్గా షిషిజినా (కజకిస్తాన్‌), 2011లో సున్‌ యావీ (చైనా) నెలకొల్పిన ఛాంపియన్‌షిప్‌ రికార్డు (13.04 సెకన్లు)ను తిరగరాసింది.

2023లోనూ జ్యోతి స్వర్ణం (13.09) సాధించింది.

100 మీ హర్డిల్స్‌లో వరుసగా రెండు, అంతకంటే ఎక్కువసార్లు పసిడి పతకాలు సాధించిన అయిదో క్రీడాకారిణి ఆమె. 

3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్‌ సాబ్లే 8 నిమిషాల 20.92 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఈ టోర్నీలో స్టీపుల్‌చేజ్‌లో భారత్‌కు స్వర్ణం లభించడం 36 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

చివరిగా 1989లో దీనారామ్‌ పసిడి నెగ్గాడు.