ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 10 వేల మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్ స్వర్ణం నెగ్గాడు.
2025, మే 27న గమి (దక్షిణ కొరియా)లో జరిగిన ఫైనల్లో అతడు 28 నిమిషాల 38.63 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు.
మెబుకి సుజుకి (జపాన్, 28 నిమిషాల 43.84 సె) రజతం, ఆల్బర్ట్ రోప్ (బహ్రెయిన్, 28 నిమిషాల 46.82సె) కాంస్యం సొంతం చేసుకున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో పుట్టిన గుల్వీర్.. 2024 ఆరంభంలోనే 10 వేల మీటర్లలో జాతీయ రికార్డు (27 నిమిషాల 00.22 సె) నెలకొల్పాడు.
5 వేల మీటర్లలోనూ జాతీయ రికార్డు (12 నిమిషాల 59.77 సెకన్లు) అతడి ఖాతాలోనే ఉంది.