భారతదేశంలో ఒకప్పుడు రేడియో సిలోన్‌గా గుర్తింపు పొందిన శ్రీలంకలోని రేడియో సర్వీసు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శ్రీలంక ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆసియాలోని షార్ట్ వేవ్ స్టేషన్లలో ఇది మొదటిది. హిందీ పాటల వీక్లీ కౌంట్‌డౌన్ షో అయిన బినాకా గీతమాలను ఈ రేడియో ప్రాచుర్యంలోకి తెచ్చింది.
ఈ రేడియో ఆసియాలోనే అతి పెద్ద రికార్డెడ్ పాటల లైబ్రరీని కలిగి ఉందని శ్రీలంక బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఎస్‌ఎల్‌బీసీ) తెలిపింది.