ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) వార్షిక సర్వసభ్య సమావేశాలు 2025, అక్టోబరు 26న కౌలాలంపూర్‌లో ప్రారంభమయ్యాయి. కూటమి భాగస్వామ్య దేశాలైన భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాలు పాల్గొన్నాయి. ఆసియాన్‌లో నూతన (11వ) సభ్యదేశంగా తూర్పు తైమూర్ ఈ సదస్సులో లాంఛనప్రాయంగా చేరింది. 1990ల తర్వాత
ఆసియాన్ తొలి విస్తరణ ఇదే. తూర్పు తైమూర్‌ను తైమూర్ లెస్ట్‌గానూ పిలుస్తుంటారు.
ప్రాంతీయ భద్రత, ఆర్థిక సమగ్రత, సముద్ర వివాదాలు, అమెరికా సుంకాలు, మారుతున్న భౌగోళిక-వాణిజ్య పద్ధతులు తదితర అంశాలపై ఈ శిఖరాగ్ర సదస్సులో చర్చిస్తారు.