భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది.
2025, సెప్టెంబరు 7న రాజ్‌గిర్ (బిహార్)లో జరిగిన ఫైనల్లో 4-1తో దక్షిణ కొరియాపై నెగ్గింది.
ఈ టైటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన 2026 ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించింది.
భారత్‌కు ఇది నాలుగో ఆసియాకప్ టైటిల్.
ఆ జట్టు ఇంతకుముందు 2003, 2007, 2017లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది.
దక్షిణ కొరియా ఈ టైటిల్‌ను అయిదుసార్లు (1994, 1999, 2009, 2013, 2022) సొంతం చేసుకుంది.