జీ20 దేశాల 20వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ 2025, నవంబరు 21న దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. ఇక్కడి గౌటెంగ్‌లోని ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో మోదికి సంప్రదాయబద్ధంగా స్వాగతం లభించింది. మోదీ జొహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో భేటీ అయ్యారు. రక్షణ, అణు ఇంధనం సహా పలు రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై చర్చించారు.