ఎలెనా రిబకినా (కజకిస్థాన్) ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఇది ఆమెకు రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2026, జనవకి 31న మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో అయిదో సీడ్ రిబకినా 6-4, 4-6, 6-4తో టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)పై విజయం సాధించింది. రిబకినా 2022 (వింబుల్డన్)లో తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది. సబలెంకా తన చివరి నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో మూడు ఓడిపోయింది.