Published on Jan 27, 2025
Current Affairs
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

ఇటలీకి చెందిన టాప్‌ సీడ్‌ సినర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో టైటిల్‌ నెగ్గాడు. 2025, జనవరి 26న మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో అతడు 6-3, 7-6 (4), 6-3తో వరుస సెట్లలో రెండో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)ను ఓడించాడు.

జిమ్‌ కొరియర్‌ (1992-93) తర్వాత మెల్‌బోర్న్‌ పార్క్‌లో వరుసగా రెండు సంవత్సరాలు విజేతగా నిలిచిన పిన్నవయస్కుడిగా 23 ఏళ్ల సినర్‌ ఘనత సాధించాడు.