ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను ఒలీవియా గడెకి, జాన్ పీర్స్ జోడీ సొంతం చేసుకుంది. 2026, జనవరి 30న మెల్‌బోర్న్‌లో హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఈ ఆస్ట్రేలియా ద్వయం 4-6, 6-3, 10-8తో క్రిస్టినా, గినార్డ్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది.
ఒలీవియా, పీర్స్ జోడీకి వరుసగా ఇది రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ టైటిల్. ఒక జోడీ ఈ టైటిల్‌ను నిలబెట్టుకోవడం 37 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1988, 1989లో పగ్, నవోత్నా ద్వయం వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ టైటిల్ గెలిచింది.