Published on Jan 27, 2025
Current Affairs
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

అమెరికన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మాడిసన్‌ కీస్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను నెగ్గింది.

2025, జనవరి 25న మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో ఆమె 6-3, 2-6, 7-5తో రెండుసార్లు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అరినా సబలెంక (బెలరాస్‌)పై విజయం సాధించింది.

కెరీర్‌లో కీస్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 19వ సీడ్‌ కీస్‌ ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో ఆడడం ఇది రెండోసారి. 2017లో ఆమె యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓడిపోయింది.

కీస్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు మధ్య దాదాపు ఎనిమిదేళ్ల విరామం ఉంది. ఓపెన్‌ శకంలో ఇదే అతి సుదీర్ఘ విరామం.