భారత్ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతులు 2024, నవంబరులో 64.4 శాతం పెరిగి 643.7 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5,500 కోట్ల)కు చేరాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వస్త్రాలు, రసాయనాలు, వ్యవసాయ ఉత్పత్తుల వంటి రంగాల్లో ఆరోగ్యకర వృద్ధి ఇందుకు దోహదం చేసిందని తెలిపింది.
అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబరు మధ్య కాలంలో దేశ సరుకుల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 5.21 శాతం క్షీణించి 5.56 బిలియన్ డాలర్ల (సుమారు రూ.47,000 కోట్ల)కు పరిమితమయ్యాయని పేర్కొంది.
మన దేశం, ఆస్ట్రేలియా 2022 డిసెంబరు 29న తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేశాయి.
ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) చేసుకున్నాయి.
ప్రస్తుతం దాని పరిధిని విస్తృతం చేయడానికి, సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ) చేసుకోవడానికి చర్చలు జరుపుతున్నాయి.