పైలట్ల శిక్షణకు వినియోగించే డీఏ40 ఎన్‌జీ విమానాల ఉత్పత్తి మనదేశంలో మొదలు కానుంది.
ఈ మేరకు ఆస్ట్రియాకు చెందిన డైమండ్ ఎయిర్‌క్రాఫ్ట్ అనే సంస్థతో మనదేశంలోని కోయంబత్తూరు కంపెనీ, శక్తి ఎయిర్‌క్రాఫ్ట్ ఇండస్ట్రీ ఒప్పందం కుదుర్చుకుంది.
దీని ప్రకారం శక్తి ఇండస్ట్రీ, ఆస్ట్రియా నుంచి 200 విమానాలు కొనుగోలు చేస్తుంది.
ఇందులో 150 విమానాలను భారత్‌లో అసెంబుల్ చేస్తారు. దీనికి ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా సంధానకర్తగా వ్యవహరిస్తుంది.