ఆస్ట్రియా ఛాన్సలర్‌గా క్రిస్టియన్ స్టాకర్ (64) 2025, మార్చి 3న చేపట్టారు. అయిదు నెలల అనిశ్చితి తరవాత ఆస్ట్రియాలో మూడు పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఐరోపా ఖండంలో 90 లక్షల జనాభా గల ఆస్ట్రియాలో మూడు పార్టీల సంకీర్ణం ఏర్పడటం ఇదే మొదటిసారి. స్టాకర్‌కు చెందిన మితవాద ఆస్ట్రియన్ పీపుల్స్ పార్టీ, వామపక్ష మధ్యేవాద సోషల్ డెమోక్రటిక్ పార్టీ, ఉదారవాద నియోస్ పార్టీలు చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.