Published on Apr 12, 2025
Current Affairs
ఆస్కార్‌ పురస్కారాల్లో కొత్త విభాగం
ఆస్కార్‌ పురస్కారాల్లో కొత్త విభాగం

సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల్లో కొత్త కేటగిరీ ‘అచీవ్‌మెంట్‌ ఇన్‌ స్టంట్‌ డిజైన్‌’ని ప్రవేశపెడుతున్నట్లు అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ సైన్సెస్‌ సంస్థ ప్రకటించింది.

స్టంట్‌ వర్క్‌ను ఫిల్మ్‌ మేకింగ్‌లో భాగంగా గుర్తించి, తెరవెనుక ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

2027లో విడుదలయ్యే చిత్రాలను ‘స్టంట్‌ డిజైన్‌’ ఆస్కార్‌ పురస్కారం వరించనుంది.