సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న మార్పుల దృష్ట్యా 2025లో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో రూపొందించిన చిత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వెల్లడించింది. 2026 మార్చి 15న 98వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెలిస్‌లో జరగనున్నట్లు తెలిపింది. ఏఐ చిత్రాలు ఇతర చిత్రాలపై ప్రభావం చూపవని, మానవ మేధస్సుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేసింది అకాడమీ సంస్థ. 2025 జనవరి నుంచి డిసెంబరు వరకు విడుదలైన చిత్రాలు ఆస్కార్ బరిలో పోటీపడనున్నాయి.