97వ ఆస్కార్ వేడుక లాస్‌ఏంజెలిస్‌లోని డాల్బీ థియేటర్ ప్రాంగణంలో జరిగింది. హాలీవుడ్ చిత్రం ‘అనోరా’.. ఉత్తమ చిత్రం సహా అయిదు కీలక విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. ఇందులోని నటనకు ఉత్తమ నటిగా మైకీ మాడిసన్ అవార్డు అందుకున్నారు. చిత్ర దర్శకుడు సీన్ బేకర్ ఒకేసారి నాలుగు అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించారు. ఉత్తమ చిత్రం, దర్శకుడు, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో ఆయన పురస్కారాలు గెలిచారు. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ పురస్కారం గెలుచుకున్నారు. ‘ది బ్రూటలిస్ట్’ సినిమాకు ఆయనుకు ఈ అవార్డు దక్కింది.
ఆస్కార్ విజేతలు
ఉత్తమ చిత్రం: ‘అనోరా’
ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ (‘ది బ్రూటలిస్ట్’)
ఉత్తమ నటి: మైకీ మాడిసన్ (‘అనోరా’)
ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ (‘అనోరా’)
ఉత్తమ సహాయ నటి: జోయీ సల్డానా (‘ఎమిలియా పెరెజ్’)
ఉత్తమ సహాయ నటుడు: కీరన్ కుల్కిన్ (‘ఎ రియల్ పెయిన్’)
ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం: ‘ఐయామ్ స్టిల్ హియర్’
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: ‘నో అదర్ ల్యాండ్’
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: ‘అనోరా’, సీన్ బేకర్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: ‘కాన్‌క్లేవ్’, పీటర్ స్ట్రాగన్
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: ‘ది బ్రూటలిస్ట్’, డేనియల్ బ్లూంబర్గ్
ఉత్తమ ఒరిజినల్ గీతం: ‘ఎల్ మాల్’, ‘ఎమిలియా పెరెజ్’
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ‘ఫ్లో’
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: ‘డ్యూన్: పార్ట్ 2’
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ‘వికెడ్’, పాల్ టేజ్‌వెల్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ‘ది బ్రూటలిస్ట్’, లాల్ క్రాలీ
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్: ‘ది ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా’
ఉత్తమ సౌండ్: ‘డ్యూన్: పార్ట్ 2’
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ‘వికెడ్’
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ‘ది సబ్‌స్టాన్స్’
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ‘అనోరా’, సీన్ బేకర్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ‘ఐయామ్ నాట్ ఏ రోబో’
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ‘ఇన్ ద షాడో ఆఫ్ ది సిప్రస్’