Published on May 29, 2025
Government Jobs
ఆలిమ్‌కోలో మేనేజర్‌ ఉద్యోగాలు
ఆలిమ్‌కోలో మేనేజర్‌ ఉద్యోగాలు

ఆర్టిఫీషియల్ లింబ్స్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కాన్పూర్‌ (ఆలిమ్‌కో) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 43

వివరాలు:

విభాగాలు: పర్సనల్ అడ్మినిస్ట్రేషన్‌, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్, ఎస్‌ఏపీ అండ్ ఐటీ, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్.

1. జనరల్ మేనేజర్: 01

2. అసిస్టెంట్ మేనేజర్: 01 

3. జూనియర్ మేనేజర్: 03

4. మెడికల్ ఆఫీసర్: 01 

5. డిప్యూటీ మేనేజర్: 02

6. ఆఫీసర్(పీ&ఓ): 05

7. ఆఫీసర్ (ఆడియాలజిస్ట్): 05

8. మేనేజర్ (ఎఫ్‌&ఏ): 01 

9. డిప్యూటీ మేనేజర్ (ఎఫ్‌&ఏ): 01

10. జూనియర్‌ మేనేజర్‌(ఎఫ్‌&ఏ): 01

11. ఆఫీసర్‌(అకౌంట్స్‌): 02

12. అకౌంటెంట్‌: 05

13. ఎస్‌ఏపీ స్పెషలిస్ట్‌: 08

14. హర్డ్‌వేర్‌ నెట్‌వర్క్‌ ఇంజినీర్‌: 01

15. ఏఐ ఇంజినీర్‌/డేటా సైంటిస్ట్‌: 01

16. స్టోర్‌ అసిస్టెంట్: 02

17. ఆఫీసర్‌(ప్రొడక్షన్‌): 01

18. షాప్‌ అసిస్టెంట్: 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్‌లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 మే 1వ తేదీ నాటికి ఆఫీసర్‌, స్టోర్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, అకౌంటెంట్‌కు 34 ఏళ్లు, షాప్‌అసిస్టెంట్‌కు 32 ఏళ్లు, జూనియర్‌ మేనేజర్‌, ఏఐ ఇంజినీర్‌, 40 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌, మెడికల్ ఆఫీసర్‌, స్పెషలిస్ట్‌కు 42 ఏళ్లు, జనరల్ మేనేజర్‌కు 55 ఏళ్లు, మేనేజర్‌కు 48 ఏళ్లు, మిగతా పోస్టులకు 45 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు ఆఫీసర్‌కు రూ.30,000 - రూ.1,20,000, స్టోర్‌ అసిస్టెంట్‌కు రూ.17,110 - రూ.58,500, అకౌంటెంట్‌కు రూ.18,790 - రూ.64,130, షాప్‌అసిస్టెంట్‌కు రూ.17,820 - రూ.61,130, ఏఐ ఇంజినీర్‌, జూనియర్‌ మేనేజర్‌కు రూ.40,000 - రూ.1,40,000, మెడికల్ ఆఫీసర్‌, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000 - రూ.1,60,000, స్పెషలిస్ట్‌కు రూ.70,000 - రూ.2,00,000, జనరల్ మేనేజర్‌కు రూ.1,00,000 - రూ.2,60,000, మేనేజర్‌కు రూ.70,000 - రూ.2,00,000. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 జులై 7.

Website:https://alimco.in/ViewRecruitment?id=AD3F01-May-2025