Published on Oct 15, 2025
Current Affairs
ఆలిండియా సింక్రొనస్‌ ఎలిఫెంట్‌ ఎస్టిమేషన్‌-2025
ఆలిండియా సింక్రొనస్‌ ఎలిఫెంట్‌ ఎస్టిమేషన్‌-2025

దేశంలో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఆలిండియా సింక్రొనస్‌ ఎలిఫెంట్‌ ఎస్టిమేషన్‌-2025 పేరుతో నిర్వహించిన గణనలో తేలింది.

2017లో 27,312 ఉండగా ప్రస్తుతం 22,446కు పడిపోయింది.

మొట్ట మొదటిసారిగా డీఎన్‌ఏ ఆధారంగా ఈ గణన నిర్వహించారు.

ఇందులో ఏనుగుల సంఖ్య 18,255 నుంచి 26,645 వరకూ ఉండవచ్చని తేలింది.

సగటున దేశంలో 22,446 ఏనుగులున్నట్లు ఈ పద్ధతిలో అంచనా వేశారు.

2021లో చేపట్టిన ఈ గణన ఫలితాలను 2025, అక్టోబరు 14న విడుదల చేశారు. 

ఏనుగుల సంఖ్యను నిర్ధారించడం కోసం అవి సంచరించే ప్రాంతాల నుంచి 21,056 పేడ నమూనాలను శాస్త్రవేత్తలు సేకరించి విశ్లేషించారు.

మొత్తం 6.7 లక్షల కిలోమీటర్ల పరిధిలో ఏనుగులు నడిచే అడవి బాటలో పరిశోధనలు నిర్వహించారు.