Published on Dec 4, 2025
Government Jobs
ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు
ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని నవరత్న సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

వివరాలు: 

మేనేజ్‌మెంట్ ట్రైనీ: 08 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.08.2025 27 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ట్రైనీ శిక్షణ కాలంలో రూ.60,000. తరువాత రూ.40,000- రూ.1,40,000.

దరఖాస్తు ఫీజు: ఓబీసీ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ/ ఎస్టీ, ఎక్స్‌సర్విస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 06.12.2025.

దరఖాస్తు చివరి తేదీ: 20.12.2025.

Website:https://rcfltd.com/hrrecruitment/recruitment-1